|| దృశ్యం న్యూస్ ||
జోన్–II బాసరకు సంబంధించిన ఈ బదిలీలు, కొత్త పోస్టింగ్‌ల ఆర్డర్లు Z.O No.453/2025 ప్రకారం రామగుండం పోలీస్ కమిషనర్, ఐ/సీ డీఐజీ జోన్–II బాసర ద్వారా విడుదలయ్యాయి. ప్రజా ప్రయోజనం, పరిపాలనా అవసరాల దృష్ట్యా అధికారులు వెంటనే కొత్త బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ బదిలీలలో భాగంగా
కిరణ్ పాల్ టౌన్–III PS నుండి ముప్కల్ PS SHOగా,
ముప్కల్ SHOగా ఉన్న రాజనీకాంత్ వంజర ను ఆర్మూర్ PS SI-Iగా,
టౌన్–1 PSలో పని చేసిన మహమ్మద్ షరీఫ్ ను నిజామాబాద్ రూరల్ SI-Iగా,
నిజామాబాద్ రూరల్ లో పనిచేసిన మహమ్మద్ అరీఫ్ ను VR, నిజామాబాద్‌కు,
VRలో ఉన్న గంగుల మహేష్ ను జక్రాన్ పల్లి PS SHOగా,
SHO మహమ్మద్ మాలిక్ రెహమాన్ ను VRకు బదిలీ చేశారు.
అదనంగా, ప్రత్యేక ఆదేశాల మేరకు మహమ్మద్ అరీఫ్ ను డిచ్ పల్లి PSకు అటాచ్మెంట్ చేశారు. అలాగే కే. వినయ్ ను నవిపేట్ PS నుంచి టౌన్–6 PSకు అటాచ్మెంట్ చేశారు.
సంబంధిత ACSPలు, యూనిట్ అధికారులు వెంటనే వీరికి బాధ్యతలు అప్పగించి, రిపోర్టింగ్ వివరాలను కమిషనరేట్‌కు పంపాలని సూచించారు.








