|| దృశ్యం న్యూస్ ||
అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బోధన్ పట్టణ ఎస్ఐ హాబీబ్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) కు విజ్ఞప్తి చేశారు. సాయికుమార్ అనే విద్యార్థి నాయకుడిపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియచేస్తూ, శుక్రవారం అర్ధరాత్రి ఒక క్యాటరింగ్ యజమాని ఓ ఫంక్షన్ హల్ లో జరుగుతున్న వేడుకకు విద్యార్థులను డబ్బు ఆశ చూపించి ఓ హాస్టల్ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడాని,
ఈ విషయాన్ని గమనించిన AIPSU నాయకులు సాయికుమార్, క్యాటరింగ్ యజమాని షేక్ ఖలీల్‌ను ప్రశ్నించగా అసభ్యకరమైన పదజాలం వినియోగించి దాడి చేసి మొబైల్ ను తీసుకున్నాడని,
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు తగిన సమయానికి రాకపోవడంతో విద్యార్థి నాయకులు డయల్ 100 కి కాల్ చేసి సమాచారాన్ని అందించడంతో వెంటనే ఎస్ఐ హబీబ్ ఖాన్ మరియు ఐదుగురు కానిస్టేబుల్స్ సంఘటన స్థలానికి చేరుకొని సరైన విచారణ చేపట్టకుండా ఫిర్యాదు దారుడైన విద్యార్థి నాయకుడిపైనే ఎస్ఐ, మరియు కానిస్టేబుల్స్ ఎదురుదాడి చేసి తీవ్రంగా గాయపరచరని,

ఈ ఘటనలో పోలీసుల దాడిని ఖండించిన AIPSU నాయకులు బోధన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అధికారికి ఈ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించామని తెలిపారు.
వారిపై తగు చర్యలు తీసుకొని యెడల హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు రామ్ చందర్, చిన్న హన్మాండ్లు, మోసిన్ గోపాల్, నాగేష్, రవి తదితరులు పాల్గొన్నారు.








