దీపావళి టపాకాయల దుకాణదారులు పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలి: లేదా కఠిన చర్యలు.

|| దృశ్యం న్యూస్ ||

దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలను నెలకొల్పాలంటే సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని,

టపాకాయల దుకాణాలు నెలకొల్పడానికి కావాల్సిన అనుమతి కోసం, వ్యాపారులు పోలీస్ వెబ్ సైట్ [www.nizamabadpolice.in](http://www.nizamabadpolice.in) లో వివరాలు అందుబాటులో ఉంటాయని వ్యాపారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి వివరాలతో సంబంధిత ఎ.సి.పి కార్యాలయంలో దరఖాస్తు పూర్తి చేయాలని, అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.

అదేవిధంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తెలియచేశారు.

1. టపాకాయల దుకాణాలు ఖాళీ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలి, ఈ ఖాళీ ప్రదేశానికి సంబంధించి NOC సర్టిఫికేట్ అందుబాటులో ఉండాలి.

2. ఒక క్లస్టర్‌లో 50 షాపులకు మించకుండా ఉండాలి.

3. జనరద్దీగల ప్రదేశాలలో టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేయకూడదు.

4. కళ్యాణ మండపాలు మరియు సమావేశాల కేంద్రాలలో టపాకాయల దుకాణాలు నెలకొల్పరాదు.

5. తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఫైర్ ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ చర్యల ద్వారా పోలీస్ శాఖ ప్రజల భద్రతను కాపాడాలని మరియు పండుగను సుఖసంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తోంది అని ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment