|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ ప్రభుత్వం శివ నూరి శోభన్ గౌడ్‌ను సీనియర్ సివిల్ కోర్టు మరియు జూనియర్ సివిల్ కోర్టు మెదక్ నందు ప్రభుత్వం తరఫున వాదించేందుకు న్యాయవాదిగా నియమించింది. ఈ నియామకానికి సంబంధించి శివ నూరి శోభన్ గౌడ్ ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. శివ నూరి శోభన్ గౌడ్ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఉత్తర్వులు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అథారిటీ లీగల్ అఫైర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మరియు జస్టిస్ విభాగంలో కీలకమైన పాత్ర పోషించనున్నారు.








