|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో షీటీమ్స్ మహిళలు, బాలికలు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మౌనం వీడి, వేధింపుల నుండి బయటపడండి అంటూ మెదక్ జిల్లా ఎస్.పి. ఉదయ్ కుమార్ రెడ్డి మహిళలకు సూచించారు.
మెదక్ జిల్లాలో మార్చి నెలలో 04 FIR లు, 11 E-PETTY కేసులు నమోదు చేశారు అని, 71 మంది ఈవ్ టీజర్లను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు అని, 238 హాట్‌స్పాట్ సందర్శనలు, 51 అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ర్యాగింగ్, ఇవ్ టీజింగ్, పోక్సో, మత్తుపదార్థాల అనర్థాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పై అవగాహన కల్పించారు.
మెదక్ డివిజన్‌లో 58 హాట్‌స్పాట్‌లను 88 సార్లు, తూప్రాన్ డివిజన్‌లో 57 హాట్‌స్పాట్‌లను 150 సార్లు సందర్శించారు అని తెలిపారు.
అత్యవసర సమయంలో డయల్ 100, షీటీమ్ వాట్సాప్ 8712657963, పోలీస్ కంట్రోల్ రూమ్ 8712657888, sheteammedakdistrict@gmail.com , Twitter@Msheteam సంప్రదించవచ్చని తెలిపారు.
అదేవిధంగా 1098 కాల్ చేసి బాల్య వివాహాల నివారణకు సమాచారం అందించాలి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మెదక్ జిల్లాలో ప్రారంభించబడింది అని స్పష్టం చేశారు.
మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఆధ్వర్యంలో షీటీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి అని హెడ్ కానిస్టేబుల్ దేవదాస్, కానిస్టేబుళ్లు ప్రమీల, విజయ్, స్వరూప, గంగామణి తమ తమ డివిజన్లలో విధులు నిర్వహిస్తు మహిళల భద్రతే ప్రాధాన్యం అనే లక్ష్యంతో షీటీమ్స్ నిరంతరం సేవలందిస్తోంది అని తెలియచేసారు.








