రగ్బీ క్రీడలో బాలిక దివ్య జాతీయ స్థాయికి ఎంపిక.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పి. దివ్య మేడ్చల్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ – 17 బాలికల రగ్బీ పోటీల్లో ఘనమైన ప్రదర్శన చూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యింది అని ఈ విషయాన్ని పిడి శారదా ప్రకటించారు.

రగ్బీ క్రీడ పోటీలలో తన ప్రతిభను చూపించిన దివ్యకు, చెగుంట మండల విద్యాధికారి నీరజ మరియు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. రగ్బీ క్రీడలో దివ్య సాధించిన ఈ ఘనత, ఆమె కృషి, పట్టుదల మరియు ఆట పై అభిరుచిని ప్రతిబింబిస్తుంది తెలిపారు.

అదేవిధంగా దివ్య జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనతో విజయం సాధించి రగ్బీ క్రీడలో మెదక్ జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని, మరియు రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలలో సాధించిన విజయాలు క్రీడా రంగంలో కొత్త మార్గాలను చూపిస్తున్నాయి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment