సంగారెడ్డి జిల్లా గంగోజిపేటలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఘనంగా ప్రారంభించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ గ్రామ అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలను మంజూరు చేశారు.

అధికారుల ఆదేశాల ప్రకారం, సీసీ రోడ్డు పనులను వేగంగా ప్రారంభించి గ్రామ వాసులకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ, మల్లారెడ్డి గ్రామ సర్పంచ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలగౌడ్ హాజరయ్యారు. అలాగే యువజన సంఘం నాయకుడు శ్రవణ్ కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్బర్, మాన్సూర్, రాజా గౌడ్, భాస్కర్, ప్రకాష్, జై భారత్ అధ్యక్షుడు ఇమ్మయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యానందం, గ్రామపంచాయతీ సెక్రటరీ మంజుల, గ్రామ పెద్దలు, యువత పాల్గొని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment