రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. శనివారం కలెక్టర్ రామాయంపేట, నిజాంపేట్ మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మొదటి విడత నామినేషన్లు ఇవాళ ముగియనున్నాయని, 160 గ్రామ పంచాయతీల్లో 1402 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని తెలిపారు.

రెండో విడతగా 8 మండలాల్లో 149 పంచాయతీలకు, 1290 వార్డులకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని, అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత పత్రాలు, బకాయిలు చెల్లించిన సర్టిఫికెట్లు సమర్పించాలని, ఎన్నికల ఖర్చులు కొత్త బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే నమోదు చేయాలని సూచించారు.

సర్పంచ్–వార్డు పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్, అభ్యర్థులను బెదిరింపు, వత్తిడి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షణకు పోటీ అవసరమని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment