|| దృశ్యం న్యూస్ ||
ఆర్మూర్ లో నూతన సీఐగా శుక్రవారం రోజు సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు.
పాత సీఐ రవికుమార్ డిజి కార్యాలయానికి బదిలీ అవుతున్న నేపధ్యంలో ఆయన స్థానంలో నూతన సీఐగా సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు చేపట్టారు, తను ఇదివరకు నల్గొండ జిల్లా సూర్యాపేట నుండి బదిలీపై ఈ ప్రాంతానికి వచ్చానని తెలిపారు, నూతన సీఐ సత్యనారాయణ గౌడ్ కు ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ గౌడ్ ప్రజల భద్రతపై మరింత దృష్టి పెట్టి, నిబంధనల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తామని తెలిపారు.








