|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో పాత గురడి రెడ్డి సంఘంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి,
ఈ సందర్భంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు.
అదేవిధంగా “కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఆరు గ్యారెంటీలు సమగ్రంగా అమలు చేయడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ నిబద్ధతో ఉందని” వివరించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక ప్రయోజనంగా, పేద కుటుంబాలకు వివాహాల సమయంలో ఆర్థిక సహాయం అందించే ఒక ముఖ్యమైన కార్యక్రమం అని, షాదీ ముబారక్ చెక్కులు, పేద కూలీలకు, కార్మికుల కుటుంబాలకు పెళ్లి వేడుకలకు ఆర్థిక సహాయం అందించి, వారిలో ఆనందాన్ని నింపేందుకు ముఖ్యమైన మార్గం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్పల్లి తాహాసిల్దార్ బి. మాలతి, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, సిరికొండ మండల అధ్యక్షుడు బాకారం రవి, అలాగే వివిధ గ్రామాల కార్యకర్తలు, ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.








