జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఘనంగా “రన్ ఫర్ యూనిటీ”.

|| దృశ్యం న్యూస్ ||

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

ధ్యాన్చన్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రన్ నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రధాన అతిథిగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – సర్దార్ పటేల్ స్పూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ, భిన్నత్వంలో ఐక్యతకు ప్రతి ఒక్కరు ప్రతీకగా నిలవాలని పిలుపునిచ్చారు. భారత యూనియన్‌లో అనేక సంస్థానాలను ఏకీకృతం చేయడంలో పటేల్ చేసిన కృషి అపూర్వమని గుర్తుచేశారు.
అలాగే నేటి యువత దేశ ఐక్యత, సమగ్రత గురించి తెలుసుకొని సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్య భారత అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, అధికారులు భారీగా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment