|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని, సభ్యుల సహకారంతో సామాజిక సేవలు మరింత బలపడతాయని తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మూఢ పోశెట్టి, కార్యదర్శిగా పున్న పోశెట్టి, క్యాషియర్‌గా బడే రాము, ఉప కార్యదర్శిగా రేపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధిలో ముదిరాజ్ సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఈ కమిటీతో పటిష్ఠమైన సేవలు అందించబడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.








