సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్ష.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నవంబర్ 14, 2025న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు నేతృత్వంలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి రాందాస్ చౌరస్తా వరకు పాదయాత్ర జరుగనున్నట్లు తెలిపారు.

పాదయాత్ర విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేయాలని, యువత, మహిళలు, విద్యార్థులు, యువజన మరియు క్రీడా సంఘాలు ఉత్సాహంగా పాల్గొని దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రమేష్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి ఎం. రంజిత్ రెడ్డి, కార్యక్రమ అధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment