పాత వర్ని గ్రామంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

|| దృశ్యం న్యూస్ ||

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం రోజున పాత వర్ని గ్రామంలో ఘనంగా జరిపారు,
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకుంటు సంతోషంతో జరుపుకొని, రేవంత్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ, పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాత వర్ని సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, మండల బీసీ సెల్ మాజీ అధ్యక్షులు నారాగౌడ్, మాజీ ఎంపీటీసీ చొక్కమ్ వీరయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొగులయ్య, కార్యదర్శి కల్లూరు జీవన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు బంజరాములు, వర్ని గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment