మెదక్ భవిత కేంద్రానికి తిరిగి విద్యుత్ కనెక్షన్ – జిల్లా న్యాయ సేవా సంస్థ సహకారం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి P.లక్ష్మి శారద ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి CH. జితేందర్ భవిత కేంద్రాన్ని సందర్శించి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

భవిత కేంద్రంలో విద్యుత్ బకాయిల కారణంగా గతంలో కనెక్షన్ తొలగించబడింది. ఈ విషయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థకు తెలియజేయగా వారి చొరవతో విద్యుత్ కనెక్షన్ తిరిగి అందుబాటులోకి వచ్చింది.

ఈ నిర్ణయంతో భవిత కేంద్ర కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. భవిత కేంద్రం తరఫున జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment