|| దృశ్యం న్యూస్ ||
ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని TNGO భవన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు, కోదండరాం MLC ని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని, కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి వేతనాలు త్వరగా చెల్లించాలనే సూచనలపై చర్చ జరిగింది, కార్మికుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
అదేవిధంగా పదవీవిరమణ అయినా కార్మికులకు ఇంకా ఇవ్వాల్సిన బకాయిలపై ప్రభుత్వం నియమించిన పునరుద్దరణ కమిటీ తక్షణం నిర్ణయం తీసుకోవాలని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వ అంగీకారంతో నడిపించడానికి చర్యలు తీసుకోవాలని, అలాగే పునరుద్ధరణలో భాగంగా వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరిగింది, గత యాజమాన్యం గ్రాటివిటీని 3.50 లక్షలుగా సీలింగ్ చేసారు, కానీ ప్రస్తుతం 20 లక్షలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడానికి కోదండరాం అంగీకరించారు.
ఈ కార్యక్రమంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నాయకులు ఉపేందర్, నాగుల రవిశంకర్ గౌడ్, పోల్కా స్వామి, శ్రీధర్, సరిచంద్ మరియు ఇతరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ అంశాలను త్వరగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.










