మెదక్: రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలి – ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ ఆర్డీవో కార్యాలయంలో గురువారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొత్తం 278 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని, ప్రతి పోలింగ్ బూత్‌కు తప్పనిసరిగా ఒక బూత్ లెవెల్ ఏజెంట్ (BLA) ను నియమించి, వారి పూర్తి వివరాలతో కూడిన జాబితాను తక్షణం సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలకు సూచించారు.

ఈ జాబితాను ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని ఆర్డీవో తెలిపారు.
సమావేశంలో BJP ప్రతినిధి ప్రభుదేవా, కాంగ్రెస్ నాయకులు పవన్–నవీన్, BSP ప్రతినిధి సిద్దిరములు తదితరులు పాల్గొన్నారు. అలాగే మెదక్ తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, AO బలరాములు, సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, రాజశేఖర్ హాజరయ్యారు.
ఈ చర్యలు ఎన్నికల నిర్వహణ పారదర్శకతకు కీలకమని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment