|| దృశ్యం న్యూస్ ||
మార్చి 2025 లో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ నేడు నిజామాబాద్ నగరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా స్థానిక జి హెచ్ ఎస్ కోటగల్లి పాఠశాలలో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించబడింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, రవీందర్ సింగ్ ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పట్ల తన అవగాహనను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంతో ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓలు సేవాలా నాయక్, సాయి రెడ్డి, అర్ వి ఎం గౌడ్, జెంసింగ్, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కృపాల్ సింగ్, వెనిగళ్ల సురేష్ మరియు ఉపాధ్యాయ బృందం భారసోసియేషన్ సభ్యులు, రవీందర్ సింగ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రవీందర్ సింగ్, “మార్చి 2025 లో జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి,” అని విజ్ఞప్తి చేశారు.










