|| దృశ్యం న్యూస్ ||
మక్కరాజ్ పేట కాంప్లెక్స్ సీ ఆర్ పి లు అయిన దేవసోత్ రమేష్ మరియు ఎర్ర శ్రీనివాస్ లకు మండల వనరుల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పొందిన వీరికి ఆత్మీయ నివాళులు అర్పిస్తూ, పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభత్వం కానీ, ప్రజా ప్రతినిధులు కానీ ఆదుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖంగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, పియర్టియు మండల అధ్యక్షుడు గజగట్ల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు చల్లా రామకృష్ణ, పరమేశ్వర్ రెడ్డి, సిద్దిరాములు, విజయ లక్ష్మి, యాదగిరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








