|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్కు నూతనంగా నియమితులైన ఎస్ఐ రామకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్సై ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటానని, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ న్యాయం కోసం కృషి చేస్తానని తెలిపారు. గ్రామాలలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావుండదని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.








