బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ వేప వృక్షం నరికేసిన వైనం : ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంతోడ రాజేందర్.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 30 సంవత్సరాలుగా ఉన్న భారీ వేప వృక్షం నరికివెయ్యడంపై తెలుగు యువత బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎంతోడ రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ చెట్టు ఆసుపత్రి వచ్చే రోగులకు, వారి కుటుంబ సభ్యులకు చల్లని నీడను అందిస్తు, వారు సెదతిరడానికి అనువైన ప్రదేశంగా ఉండేది అని, ప్రభుత్వాలు చెట్లను పెంచాలని ప్రచారం చేస్తు మొక్కలు నాటడానికి ఖాజానాలు ఖర్చు చేస్తుంటే, బోధన్ ఆస్పత్రిలో మాత్రం భారీ వేప వృక్షాన్ని నరికివేయించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తనే స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరిశీలించడం జరిగిందని.

ఈ చెట్టును నరికి వేయడానికి గల కారణాలను తెలియచేయాలని, ఇంత పెద్ద వృక్షాన్ని నరికి వేయించిన వారిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాజేందర్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment