మెదక్‌లో రెయిన్‌గేజ్ & AWS తనిఖీ – సంతృప్తికరంగా పని చేస్తున్న స్టేషన్లు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లాలో వర్షాకాలానికి ముందు రెయిన్‌గేజ్ స్టేషన్లు మరియు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (AWS) పనితీరును సిపిఓ బద్రీనాథ్ తనిఖీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో తనిఖీ నిర్వహించి, స్టేషన్లు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

మెదక్ జిల్లాలో మొత్తం 21 మాన్యువల్ రెయిన్‌గేజ్ స్టేషన్లు, 36 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్లు వర్షపాతం, గాలి వేగం, గాలి దిశ, తేమ, ఉష్ణోగ్రత వంటి వాతావరణ సమాచారాన్ని నమోదు చేస్తాయి. ప్రతి 10 కిమీ x 10 కిమీ గ్రిడ్‌లో కనీసం ఒక AWS ఏర్పాటు చేయబడింది. గత 24 గంటల వర్షపాతం రికార్డు చేయడం ద్వారా రైతులకు, వాతావరణ పరిశోధనలకు ఉపయోగకరమైన సమాచారం అందుబాటులోకి వస్తుందని సిపిఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఎమ్మెస్ ఓ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment