|| దృశ్యం న్యూస్ ||
ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NCGG) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సివిల్ సర్వెంట్‌లకు అతిధి ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమం సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఇండియన్ ఓసియన్ రీజన్ల నుండి వచ్చిన వివిధ దేశాల సివిల్ సర్వెంట్స్ కోసం స్థానిక పాలనలో సామర్థ్యాల పెంపుపై కార్యక్రమం జరిగింది.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ సందర్భంగా స్థానిక పాలనలో తమ అనుభవాలను పంచుకున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్న స్థానిక పాలన విధానాలను వివరిస్తూ, ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలాగే వివిధ దేశాల సివిల్ సర్వెంట్లకు విలువైన సలహాలు మరియు సూచనలు అందించారు.

గత సంవత్సరం కూడా ఢిల్లీలో బంగ్లాదేశ్ స్థాయి సివిల్ సర్వీస్ అధికారులకు, అలాగే ట్రైనీ సివిల్ సర్వీసు అధికారులకు ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక పాలనలో సామర్థ్యాల పెంపును కంటికి కట్టినట్లు అనే విధంగా దిశానిర్దేశంలో సివిల్ సర్వెంట్స్ విలువైన పాఠాలను నేర్చుకున్నారు.










