|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా మెదక్ మాచారం రాంపూర్ ప్రాంతంలో వనదుర్గ ప్రాజెక్ట్ నుండి సాగునీరు అందించే M.N.కెనాల్ మరియు దానికి సంబంధించిన పిల్లకాలువలపై ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ ప్రక్రియలో కలెక్టర్ మాట్లాడుతూ, పంట పొలాలకు సాగునీరు సరఫరా సమర్థవంతంగా అందించడానికి నీటి పారుదల శాఖాధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. “వనదుర్గ ప్రాజెక్ట్ పరిధిలోని సాగు నీటిని సమర్థవంతంగా వినియోగించడం కోసం ప్రణాళికలు అమలుచేస్తున్నాం,” అని చెప్పారు.

సింగూర్ ప్రాజెక్ట్ నుండి 4.06 టీ.ఎం.సీ సాగునీరు వనదుర్గ ప్రాజెక్టుకు అలికేషన్ చేయబడిందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా 21,625 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడిస్తూ, జనవరి 15 నుండి ఏప్రిల్ చివరి వరకు సాగునీరు సరఫరా జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








