మెదక్ జిల్లాలో మదర్సా విద్యార్థులకు అస్వస్థత – కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక చర్యలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లోని మదర్సా ప్రైవేట్ వసతి గృహంలో విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 10 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు రావడంతో 108 అంబులెన్స్ ద్వారా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.

మంగళవారం ఉదయం కలెక్టర్ రాహుల్ రాజ్ బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులను ఆరా తీశారు. తక్షణ చికిత్స అందించడంతో ప్రస్తుతం విద్యార్థులంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

కలుషిత ఆహారంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని, జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థల వంటగదుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు.

ఆహార పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, వంటగదుల్లో శుభ్రత, తాజా పదార్థాల వినియోగం, సరైన నిల్వ విధానాలపై యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment