|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, విద్యార్థుల్లో కృత్రిమ మేధా (AI) ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు పొందుతారని, పాఠశాలలో కృత్రిమ మేధా ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, పిల్లలు చదవడం మరియు రాయడం వంటి అభ్యాస సామర్థ్యాలు పెంచేందుకు ఈ ల్యాబ్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

విద్యార్థులు కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి తమ విద్యను మెరుగుపరచాలని సూచించారు. AI ద్వారా విద్యార్థుల ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకునే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.

అదేవిధంగా, ఈ సాంకేతికతను అమలు చేసేందుకు అవసరమైన వసతులు సమీకరించి, జిల్లా పరిషత్ లోని ఆరు పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.








