మెదక్ జిల్లాలో వరి పంటకు సమృద్ధిగా సాగునీరు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కుల్చారం మండలం వరి గుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాల్లో రైతుల పొలాలను పరిశీలించారు.

దేవులపల్లి గ్రామం జంగం రమేష్ రెండు ఎకరాలు, ముత్యం నరసింహులు మూడు ఎకరాల వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ, పంట కోత సమయం సాగునీటి వినియోగ పద్ధతులు, వరి తడుల అవసరం, గత సంవత్సరం పంట వివరాలు తెలుసుకున్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఇరిగేషన్ ద్వారా సాగునీరు సమృద్ధిగా అందుతుందని తెలిపారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు అందించడంతో పాటు రక్షణ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment