తక్షణమే నూతన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలి : PRTU తెలంగాణ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ ||

PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ తక్షణమే నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధిత విద్యాశాఖ మరియు ట్రెజరీ అధికారుల సహకారాన్ని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఉపాధ్యాయులు తమ నియామక ఉత్తర్వులు, జాయినింగ్ రిపోర్ట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ మరియు ఎంప్లాయిస్ వెల్ఫెర్ ఫండ్ ₹50/- మొత్తం DDO కట్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన నూతన ఉపాధ్యాయుల జాబితా మరియు యాక్ట్ 2 సర్టిఫికెట్ జిరాక్స్ పై DDO అటెస్టేషన్ చేయించి, ట్రెజరీ అధికారులకు ఇన్ డూప్లికేట్ బిల్లులు సమర్పించడం ద్వారా మాత్రమే వేతనాలు మంజూరు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రక్రియపై ఉపాధ్యాయులు అవగాహన కలిగి, ముందుగా అందించిన డాక్యుమెంట్లను సమర్పించి తక్షణమే వేతనాలు పొందాలని కృపాల్ సింగ్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment