శ్రీనగర్ గ్రామంలో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై నిరసన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, శ్రీనగర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గ్రామస్తులు అమిత్ షా ఫోటోకు చెప్పుల దండ వేసి ఊరేగించి దహనం చేశారు.

ఈ సందర్భంగా మాల సంఘ నాయకులు అమిత్ షా ను వెంటనే బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచందర్, చందు, నిలేష్, సుభాష్ కృష్ణ, చింటూ, నాని, నరసింహ, విట్టల్, రాజు, మాల సంఘ నాయకులు, శ్రీనగర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ గౌరవాన్ని కాపాడే విధంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన గ్రామస్తులు, బీజేపీ ముఖ్యనేత చర్యలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment