ఉన్ని దుస్తుల ధరలు ఆకాశానికి: వలస వ్యాపారుల దండయాత్ర.

|| దృశ్యం న్యూస్ ||

చలికాలం మొదలయ్యే సరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్ని దుస్తుల విక్రేతలు గుమికూడటం సర్వసాధారణం. అనేక రాష్ట్రాల నుండి వలసగా వచ్చి చిన్న చిన్న దుకాణాలు వేసుకుని, మొదట తగ్గించిన ధరలతో స్థానిక ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు. కానీ చలి తీవ్రత పెరిగే కొద్దీ అదే దుస్తుల ధరలను రెట్టింపు చేసి అమ్మడం ఇప్పుడు కొత్త సమస్యగా మారింది.

ఉదాహరణకు గత 15 రోజుల క్రితం 150 రూపాయలకు లభించిన ఓ ఉన్ని వస్త్రం ప్రస్తుతం 250 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చలి పెరుగుదల పేరుతో భావోద్వేగాలను వాడేసుకుని స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అదేవిధంగా, ఈ వ్యాపారాలకు స్థల యజమానుల అనుమతి తప్ప ఇతర శాఖల పర్యవేక్షణ లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది. అనుమతులు కోరాల్సిన సంబంధిత అధికారులు నిశ్శబ్దంగా వ్యవహరిస్తుండటం పట్ల పలు సందేహాలకు తావిస్తోంది.
పలువురి ద్వారా సోషల్ మీడియాలో వీరి వ్యాపారంపై అధిక ప్రచారం కావడంతో ప్రజలను ఆకర్షిస్తూ ఆర్థికంగా దోచేస్తున్నారు, అక్రమ ఆదాయం సంపాదించే చోట సరైన చర్యలు తీసుకునే ఆసక్తి అధికారులలో కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా స్థానిక అధికారుల జోక్యంతో ఈ పరిస్థితి సరి పడుతుందా అన్నది చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment