|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, వర్షాల కారణంగా పంటలు తడిసి నష్టపోకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు (Tarpaulins) సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, రైతులు నిల్వ చేసిన లేదా ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడాలని సూచించారు.
తుపాను ప్రభావం గురించి రైతులకు సమయానుకూల సమాచారం అందజేసి, అవసరమైతే మూడు రోజుల పాటు వరి కోతలు నిలిపివేయాలన్న అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మిల్లులకు పంపిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని, ట్రక్ షీట్లు వెంటనే నమోదు చేయాలని తెలిపారు.








