|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కార్యక్రమం నేడు వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మెదక్ జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.
వాతావరణం సాధారణ స్థితికి చేరిన తరువాత ప్రజాదర్బార్ తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని, అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ విజ్ఞప్తి చేశారు.








