|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సాయి చైతన్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణను అత్యంత ప్రాముఖ్యతనిస్తామని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేదేమీ లేదని, ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని, మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణపై ప్రత్యేక ప్రణాళిక :
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని, అదేవిధంగా యువత డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు వ్యసనపరులై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని, దీని నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని తెలిపారు.
పోలీస్ సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
ప్రజలకు ఎప్పుడూ పోలీస్ శాఖ సేవలు అందుబాటులో ఉంటాయని, అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా సహాయం పొందవచ్చని సూచించారు.
సాయి చైతన్య – వృత్తి పరమైన వివరాలు.

సాయి చైతన్య, 2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, ఐఐటి బెనారస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. ఇటీవల, తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా పని చేసి నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
గతంలో కటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్)గా, హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా సేవలందించారు.








