|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, బోధన్ లోని రూరల్ సీఐ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ఎసిపి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది, నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ కావ్య నేతృత్వంలో, డివిజన్ పోలీసు బృందం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ శిబిరానికి ప్రముఖ పాత్రికేయులు నవీన్, కన్నె రవి, ముక్త్యార్ తదితరులు తమ రక్త దానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారిని, మరియు సహకరించిన వారిని ప్రత్యేకంగా ఎసిపి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలుపుతూ, రక్తదానం మహాదానం అని పేర్కొంటూ ఈ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో వివిధ వ్యాపార సంస్థల నిర్వాహకులు ప్రదీప్ గుప్తా, పురుషోత్తం, గోపాల్, బోధన్ పట్టణ సీఐ వెంకట్ నారాయణ, ఎస్ఐలు మచ్చేందర్ రెడ్డి, వంశీకృష్ణ, సాయన్న, పోలీసు హాస్పిటల్ ఇంచార్జ్ దేవగౌడ, మరియు డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. పలు గ్రామ ప్రజలు కూడా ఈ శిబిరానికి వచ్చి రక్తదానం చేశారు.










