|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న కమిషనర్ ఆమెను గమనించి వెంటనే తన వాహనం ఆపి అందులో నుండి దిగి వృద్ధురాలి వద్దకు చేరుకుని సమస్యను శ్రద్ధగా విన్నారు.

ఆర్మూర్‌కు చెందిన యాదమ్మ వివరించిన ప్రకారం, తమ కుటుంబ బంధువుల నుంచి పాత కక్షల నేపథ్యంలో తనపై దాడి జరిగిందని తనకు న్యాయం కావాలని కోరగా, ఈ విషయమై వెంటనే స్పందించిన కమిషనర్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ SHOకి తక్షణమే చర్యలు ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.








