|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య IPS సఖి సెంటర్ ని సందర్శించారు. షెల్టర్‌లో నివసిస్తున్న బాధిత మహిళలతో కమిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా గృహహింస, మోసపూరిత సంబంధిత కేసుల బాధితులతో మాట్లాడి తగిన సూచనలు ఇచ్చారు.

ఈ సందర్బంగా 181 కాల్ సెంటర్ డ్యాష్‌బోర్డ్, మిషన్ శక్తి డ్యాష్‌బోర్డ్, కేసుల ఫాలోఅప్ విధానాలు, రిజిస్టర్ వివరాలను సమీక్షించారు. సఖి సెంటర్ నిర్వహణ పట్ల కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని సేవలు సమయానికి అందుతున్నాయని సిబ్బంది వివరించారు.
అలాగే సఖి, భరోసా, ICPS సర్వీసులు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుందని కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, మహిళా కమిషన్ సభ్యురాలు సుదం లక్ష్మి, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సఖి అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ, డీసీపీవో చైతన్య, సఖి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








