నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు: పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్.

|| దృశ్యం న్యూస్ ||

పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను విధి నిర్వహణ కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని, పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ తెలిపారు.
ఈ వారోత్సవాలు తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు, 21-10-2024 నుండి 31-10-2024 వరకు నిజామాబాద్ కమీషనరేటులోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో జరగనున్నాయని,
ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సందర్భంగా క్యాండిల్ ర్యాలీలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు మరియు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించనున్నారాని, అంతేకాకుండా, జాతీయ ఐక్యత దినోత్సవం జరగనుందని ఈ సందర్భంగా పోలీస్ కళా బృందం మరియు పోలీస్ బ్యాండ్ ద్వారా జనరద్దీగల ప్రాంతాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు.

అదేవిధంగా అన్ని థియేటర్లలో పోలీస్ సేవలపై అవగాహన పెంచడానికి స్లైడ్స్ ద్వారా ప్రచారం జరుగుతుందాని, ఈ కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది త్యాగాలను గుర్తించేందుకు మరియు సమాజంలో శాంతి మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment