బాన్సువాడ : అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ పూజలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు, పూజ అనంతరం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నుండి శబరిమలకు పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన అయ్యప్ప దీక్ష స్వాముల బృందానికి జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది, ఈ ప్రత్యేక పూజ కార్యక్రమం భక్తులకు మున్ముందు జరిగే పాదయాత్రలకు ఒక ముఖ్యమైన ప్రేరణను ఇస్తుందని అయ్యప్ప భక్తుల ఉత్సాహాన్ని పెంచుతూ, ఇది సమాజంలో ఆధ్యాత్మికతను నింపడానికి సహాయపడుతుంది అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment