|| దృశ్యం న్యూస్ ||
గత ప్రభుత్వంలో సీఎం కెసిఆర్ దయతో నియోజకవర్గంలో 11 వేల డబుల్ బెడ్ రూమ్ లను నిర్మించామని వ్యవసాయ సలహాదారు మరియు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు, ఆయన శుక్రవారం మండలంలోని సహకార సంఘం వద్ద ఏర్పాటు చేసిన వరి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేటప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
రైతులు మరియు స్థానికులు కలిసి పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు, రుణ మాఫీకి సంబంధించి సర్వేను పూర్తి చేసి, బాధ్యతగా తీసుకోవాలని వ్యవసాయ అధికారి శ్రీనివాసరావుకు సూచించారు.
కాసుల బాలరాజు మాట్లాడుతూ, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇంచార్జ్ గా ఉంటాడని, స్థానికులు మాత్రమే ఈ ప్రాంతానికి సంబంధించి నిజమైన అభివృద్ధి తీసుకురాగలరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శంకర్ పటేల్, పుప్పల శంకర్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కూచి సిద్దు, ఎంపీడీవో శ్రీనివాసరావు మరియు రైతులు పాల్గొన్నారు.










