|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆహార భద్రతా అధికారుల లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చే వరకు అధికారులు పట్టించుకోకుండా ఉండటం అసంతృప్తిని పెంచుతోంది. ఇటీవల, జిల్లా కేంద్రంలోని KFCలో కుళ్లిన చికెన్ కేసు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, అధికారులు ఒక్కరోజులో ప్రత్యక్ష తనిఖీలు చేసి నోటీసులు జారీ చేసిన ఘటనతో అధికారులు ప్రజల భద్రత పట్ల అజాగ్రత్త వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడేలా చేస్తున్నారని స్పష్టం అవుతోంది.

జిల్లా వ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్, స్నాక్స్ కేంద్రాలు, చిన్న పిల్లల కోసం ప్యాకేజ్డ్ చిరుతిండ్లు, గడువు తీరిన పానీయాలు, ఇతర ఆహార పదార్థాలను విక్రయించడం, తయారు చేయడం ఇలా ఎన్నో కొనసాగుతునే ఉన్నాయి, కానీ ఈ ప్రక్రియలో చాలా ఆహార కేంద్రాలు సరైన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిషేధిత పదార్థాలను ఉపయోగించడం, సరైన అనుమతులు లేకుండా పలు కేంద్రాలు కొనసాగుతున్న అధికారులు మాత్రం కార్యాలయాల నుండి కాలు బయటకు పెట్టడం లేదు.
గతంలో కఠిన తనిఖీలతో, కఠిన చర్యలతో ఆహార వ్యాపార కేంద్రల యజమానులను గడగడలాడించిన సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి ఇక రాడు అని, జిల్లా ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి రాక ఎదురుచూస్తున్నారు. ఆహార భద్రతా శాఖ ప్రజలకు భద్రమైన, శుద్ధమైన ఆహారం అందించడం కోసం కఠినంగా వ్యవహరించాలి.

ఆహార భద్రత అధికారులు –
●రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో క్రమపద్ధతిలో తనిఖీలు.
◆ఆహార ఉత్పత్తులపై భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అనే పరీక్ష.
◆ప్రమాదకర లేదా కలుషితం ఉన్న ఆహారాలను గుర్తించి చర్యలు.
◆తనిఖీలు, నమూనాల ఫలితాలు, నిబంధనలు ఉల్లంఘించినవారికి నోటీసులు, అవసరమైతే ఉత్పత్తులను స్వాధీనం తీసుకోవడం లేదా షాపులను మూసివేయడం.
◆ప్రజలకు భద్రమైన ఆహారం, ఫుడ్ సేఫ్టీ సూచనలు ఇవ్వడం.
వ్యాపారులకు నిబంధనల ప్రకారం ఆహారం తయారీ పద్ధతులు బోధించడం.
👉ఇలా ఎన్నో అధికారాలు ఆహార భద్రత అధికారులకు ఉన్న సమగ్ర చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యం రక్షించబడడం లేదు. నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రతా అధికారులు కఠినంగా మరియు సమయానుకూలంగా తనిఖీలు చేపట్టి నియమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలి అని ప్రజలు కోరుతున్నారు.








