ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అడవిలో క్రూర మృగం తిరుగుతున్నది.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూరు, మాయపూర్ అడివి ప్రాంతంలో సంచరించేది పులికాదని అది ఒక క్రూర మృగం అని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ పేర్కొన్నారు.
మంగళవారం కొండూరు గ్రామ శివారులో పోతన్న అనే గొర్ల కాపరి తన మేకలపై దాడి చేసిన జంతువును గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి మరియు మండల ఎస్ఐ చిరంజీవి కలసి అక్కడి పరిసర ప్రాంతాలలో పరిశీలన జరపగా జంతువుల పాదముద్రలు గుర్తించి అవి పులి పాదముద్రలు కావు అని ఏదో ఒక్క క్రూర జంతువుకు చెందినయని స్పష్టం చేశారు.

ఫారెస్ట్ అధికారి సుధాకర్ మాట్లాడుతూ, రైతులు పశువుల కాపరులకు జాగ్రత్తగా ఉండాలని, ఈ క్రూర జంతువుల పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని సూచిస్తూ, జంతు సంరక్షణ చట్టం ప్రకారం జంతువులకు హాని కలిగిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment