ధర్పల్లి మండలంలో అగ్ని ప్రమాదం: పేద కుటుంబానికి తక్షణ సహాయం అందించిన పీసు రాజ్ పాల్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపంగి సాయమ్మ మరియు ఆమె కుటుంబం తీవ్రంగా నష్టపోయారు.
సంపంగి సాయమ్మ గుడిసెలోనే నిద్రపోతున్నప్పుడు మంటలు చెలరేగడంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. ఆ ప్రమాదంలో గుడిసెలోని వంట సామాగ్రి, బట్టలు, నగదు మొత్తం కోల్పోయి కుటుంబం మొత్తం రోడ్డున పడింది.

ఈ విషయంలో తక్షణ స్పందన చూపిన మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీసు రాజ్ పాల్ రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి బియ్యం, పప్పు, నూనె, వంట సామాగ్రి, నగదు అందించి అ కుటుంబాన్ని ఓదార్చి మాజీ ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి తీసుకెళ్ళి మరింత సహాయం అందించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.
బాధితురాలైన సంపంగి సాయమ్మ మాట్లాడుతూ, 15 సంవత్సరాల క్రితం తన కూతురు సుజాత మరణించిందని, ఇప్పుడు సుజాత ఇద్దరు కూతుళ్ళను మరియు ఒక కుమారుని కూలి పనులు చేస్తూ చదివిస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ అగ్నిప్రమాదంతో ఆర్థికంగా మరింత కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం నుండి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పీసు రాజ్ పాల్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, దండవుల వెంకట్, శిరసు సురేష్, అల్లెపు నర్సయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment