తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష – ప్రభుత్వానికి హామీల అమలు కోరుతూ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ ||

తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ పిలుపు మేరకు, సోమవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో శాంతియుత దీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ దీక్షలో మలిదశ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్తా, సీనియర్ ఉద్యమకారుడు జెజ్జరి నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమ సమయంలో ప్రాణాలు త్యాగం చేసిన యోధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా 250 గజాల ఇంటి స్థలం, నెలవారి పెన్షన్, ఉచిత బస్సు పాస్, ఆరోగ్య కార్డు, సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ఉద్యమకారులకు 20% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యమ స్ఫూర్తిని నిలిపేలా హక్కుల సాధనలో ఏకత్వంతో ముందడుగు వేయాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment