ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి.

|| దృశ్యం న్యూస్ ||

శనివారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అనుపమను అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ ఈవో చంద్రశేఖర్, అర్చకులు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు.

అనంతరం న్యాయమూర్తి దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందుతూ తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తుల ఆధ్యాత్మిక శ్రద్ధకు కేంద్రంగా నిలుస్తోంది. శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment