|| దృశ్యం న్యూస్ ||
ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ర్యాలీకి శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ స్వామీజీ గౌరవప్రదంగా హాజరై, హిందూ యువతలో మరింత చైతన్యం నింపే విధంగా దేవాలయ భూముల పరిరక్షణపై ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
స్వామీజీలు తెలిపిన సూచనలతో, ఈ ఉద్యమం మరింత బలపడాలని, దేవాలయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు కర్తవ్యం అని తెలుపుతూ. శంభుని గుడి చుట్టూ ఉన్న అన్యమతస్తుల దుకాణాలను తొలగించే వరకు, బోధన్ పట్టణంలో వంద స్తంభాల గుడి పునర్నిర్మాణం జరిగే వరకు, బడాపహాడ్ లోని రామ లంక దేవాలయ పునరుద్ధరణ వంటి ముఖ్యమైన పనులు పూర్తి అయ్యేవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది అని,

అదేవిధంగా హిందూ దేవాలయ ఆస్తులను, భూములను తిరిగి దేవాలయాలకు అప్పగించే వరకు, మరియు సనాతన బోర్డు ఏర్పాటు చేసే వరకు ఎన్ని ఉద్యమ కార్యక్రమాలు అయిన చేపడుతామని, ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ ఈ విషయాన్ని అంగీకరించని యెడల ఈ ఉద్యమం మరింత శక్తివంతంగా మారుతుందని పటేల్ ప్రసాద్ తెలుపుతూ,
ఇకపై చేపట్టే కార్యక్రమాలకు కులాలు, పార్టీలను మినహాయించి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేవలయాల పరిరక్షణకు సహకరించి ఉద్యమించాలని కోరారు.








