|| దృశ్యం న్యూస్ ||
శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను సమీక్షించారు. సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, యూనిఫాం ప్రదర్శనపై ఎస్పీ విశేషంగా దృష్టి సారించారు. ప్రతి పోలీస్ సిబ్బంది తమ విధుల్లో ప్రొఫెషనల్ మానసికతతో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

అదనపు ఎస్పీ మాట్లాడుతూ పరేడ్‌లు క్రమశిక్షణ, సమన్వయం, ఫిట్‌నెస్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో తక్షణ స్పందన చూపి ప్రజా విశ్వాసాన్ని మరింతగా పెంచాలని సూచించారు.
ఈ పరేడ్‌లో ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్‌బీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మెదక్ రూరల్ సీఐ జార్జ్, మెదక్ టౌన్ సీఐ మహేష్, ఆర్‌ఐ రామకృష్ణ, ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








