భాజపా ఆధ్వర్యంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ బీజేపీ కార్యాలయంలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్‌తో కలిసి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం అంజిరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ ధరల తగ్గింపు మధ్యతరగతి, రైతులు, పేదలకు ఉపశమనంగా మారిందని, 28% జీఎస్టీని 18%కు, 18%ని 5%కు, 12%ని 0% శాతానికి తగ్గించడం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సౌలభ్యాన్ని కల్పించిందని చెప్పారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం దేశ అభివృద్ధికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు, మొక్కల నాటకం, కులవృత్తుల సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ రాజేందర్ జిల్లా కార్యదర్శులు కల్కి నాగరాజు బాదే బాలరాజు బిక్షపతి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్లు MLN రెడ్డి నల్లాల విజయ్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ కిసాన్ మోర్చా జిల్లా ఇంచార్జ్ తుమ్మేటి వెంకట్ రెడ్డి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసీ రెడ్డి పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment