|| దృశ్యం న్యూస్ ||
మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వై. పద్మ దేవేందర్ రెడ్డి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది అందరికీ శాంతి, సంపద, సౌభాగ్యాన్ని అందించాలన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఉగాదిని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని కోరారు.
మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుంటుందని, అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఉగాది పర్వదినం కొత్త ఆశయాలు, కొత్త ఉత్సాహం కలిగించాలని ఆకాంక్షించారు.








