ఉగాది సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, వారి కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనం.

|| దృశ్యం న్యూస్ ||

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో, పూర్ణకుంభంతో కలెక్టర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగకు ప్రాచీన శాస్త్రీయత ఉందని, ఆరోగ్య పరంగా వేపపువ్వుతో చేసిన పచ్చడి కీలకమని వివరించారు. వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే ఈ పండుగను తెలుగువారు ప్రకృతి పండుగగా జరుపుకుంటారని తెలిపారు.

అదనపు కలెక్టర్ నగేష్ కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్వాహకులు, అర్చకులు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment