అంబం (ఆర్)లో అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శనివారంనాడు దక్షిణాముకి హనుమాన్ మందిర్ వద్ద అఖండ హరినామ సప్తహ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఉదయం నుంచే ఆలయ పరిసరాలు హరినామ స్మరణతో మారుమోగాయి.

ఈ సప్తహ కార్యక్రమం ఏడు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో వివిధ గ్రామాల నుండి వచ్చిన మహారాజులు ప్రవచనాలు, భక్తి పాటలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలను పొందేందుకు ఈ కార్యక్రమం గొప్ప అవకాశంగా మారింది.

ఈ కార్యక్రమానికి భక్తులు తరలి రావాలని గ్రామాభివృద్ధి నిర్వాహకులు కోరారు. అఖండ హరినామ సప్తహ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచే ఈ కార్యక్రమం గ్రామ ప్రజల మధ్య కలయికను ప్రేరేపిస్తుంది తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment